Thursday, February 12, 2026
HomeతెలంగాణStartup Fund | వెయ్యి కోట్లతో స్టార్టప్ ఫండ్ ఏర్పాటు

Startup Fund | వెయ్యి కోట్లతో స్టార్టప్ ఫండ్ ఏర్పాటు

స్టార్టప్ కంపెనీను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలతో స్టార్టప్ ఫండ్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. ఈ నిధులను సద్వినియోగం చేసుకొని స్టార్టప్ కంపెనీలను ప్రారంభించడమే కాకుండా కనీసం ఒక బిలియన్ డాలర్ల కంపెనీలుగా ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ టీ-హబ్(T-Hub)లో ఏర్పాటుచేసిన గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్(Google for Startups Hub)ను సీఎం రేవంత్.. మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఏర్పాటవుతున్న స్టార్టప్ కంపెనీలు యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలన్న లక్ష్యంతో పని చేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.

సీఎం ఇంకా ఏమన్నారంటే..

  • హైదరాబాద్ నుంచి కనీసం 100 స్టార్టప్స్ యూనికార్న్‌ కంపెనీలుగా ఎదగాలని ఆశిస్తున్నా.
  • అంటే.. కనీసం ఒక బిలియన్ డాలర్ల విలువ గల కంపెనీలుగా ఎదగాలి.
  • వీటిలో 2034 నాటికి కనీసం 10 స్టార్టప్‌లు సూపర్ యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలి.
  • 1998లో స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో ఇద్దరు మిత్రులు కలిసి కారిఫోర్నియాలో స్టార్టప్‌గా ప్రారంభించిన ఒక గ్యారేజీయే ఇప్పుడు గూగుల్‌గా అవతరించింది. ఇదెంతో స్ఫూర్తిదాయకమైన అంశం.
  • రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక విజన్‌తో ముందుకు సాగుతూ ప్రపంచానికి తెలంగాణ బ్రాండ్‌ను పరిచయం చేయాలన్న లక్ష్యంతో రెండు రోజుల పాటు తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌పైన గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించాం.
  • జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ ప్రతినిధుల సమక్షంలో తెలంగాణ రైజింగ్ విజన్‌ను ఆవిష్కరించాం.
  • 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లు.. అలాగే 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తెలంగాణ రాష్ట్రం ఎదగాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నాం.
  • పదిహేను ఇరవై ఏళ్ల కిందట ప్రారంభించిన అనేక స్టార్టప్‌లు ఇప్పుడు బిలియన్స్ డాలర్ల కంపెనీలుగా ఎదిగాయి.
  • గూగుల్ (#Google), ఆపిల్ (#Apple), అమెజాన్ (#Amazon), టెస్లా (#Tesla), మెటా (#Meta) వంటి ఎన్నో ఉదాహరణలు మనముందున్నాయి.
  • గత 25 ఏళ్లుగా సాఫ్ట్‌వేర్ సర్వీసెస్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్‌లో ప్రారంభమైన చాలా స్టార్టప్‌లు పెద్ద పెద్ద కంపెనీలుగా ఎదిగాయి.
  • తెలంగాణ రైజింగ్ విజన్‌లో స్టార్టప్‌లకు సంబంధించి మీ ప్రణాళిక ఏంటని అడిగినప్పుడు.. స్టార్టప్‌లను నేను ఫుట్‌బాల్ క్రీడతో పోల్చుతా.
  • ఎందుకంటే.. నేను ఫుట్ బాల్ ఆడతాను. ఫుట్‌బాల్‌లో సమిష్టి కృషి అవసరం. పట్టుదలతో సాధన చేయాలి. టీమ్ వర్క్‌తో పనిచేయాలి.
  • చివరగా విజయం సాధించడం చాలా ముఖ్యం. స్టార్టప్‌లు కూడా అదే విధంగా పనిచేయాలి.
  • హైదరాబాద్ ప్రస్తుతం వస్తు ఉత్పత్తి ఆధారిత స్టార్టప్‌లు, ఇన్నోవేటివ్ స్టార్టప్‌లు, ఐపీ ఇంటెన్సివ్ స్టార్టప్‌లపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది.
  • హైదరాబాద్ కేవలం స్టార్టప్స్ మాత్రమే కాకుండా యునికార్న్ కంపెనీల హబ్‌గా ఎదగాలన్నది నా ఆకాంక్ష.
  • స్టార్టప్‌లకు అవసరమైన సహకారం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ కలిసి పనిచేయబోతున్నాయి.
- Advertisement -
RELATED ARTICLES

Latest News