పంచాయతీ ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరణ
జీవో నంబర్-46పై హైకోర్టు(High Court)కు వెళ్లిన బీసీ కుల సంఘాల(BC Associations)కు చుక్కెదురైంది. పంచాయతీ ఎన్నికల(Panchayat Elections)పై స్టే (Stay) ఇచ్చేందుకు న్యాయస్థానం ఒప్పుకోలేదు. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనందున ఈ సమయంలో నిలిపివేయలేమని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రకటన (Notification) వెలువడ్డాక సవాల్ చేయటంపై ప్రశ్నలు సంధించింది. తదుపరి విచారణను 8 వారాలు వాయిదా వేసింది. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల(Resevations)పై ప్రభుత్వం ఈ జీవోను జారీ చేసింది. అయితే.. బీసీల్లో ఏబీసీడీ ఉపవర్గాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని వెనకబడిన కుల సంఘాలు హైకోర్టును కోరాయి.
- Advertisement -
