Tuesday, March 10, 2026
Homeనిజామాబాద్‌Jagruti Kavitha | ముంపు రైతులకు 25 వేలు ఇవ్వాలి

Jagruti Kavitha | ముంపు రైతులకు 25 వేలు ఇవ్వాలి

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు (Telangana Jagruti President) కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) గురువారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. జాగృతి జనం బాట(Jagruti Janam Baata)లో భాగంగా జుక్కల్(Jukkal), బాన్సువాడ(Bansuada), కామారెడ్డి(Kamareddy) సందర్శించారు. జుక్కల్ నియోజకవర్గంలో 40 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో నాగమడుగు లిప్ట్‌(Nagamadugu Lift)ను ప్లాన్ చేశారని చెప్పారు. అందుకోసం దాదాపు 2 వందల ఎకరాలకు పైగా భూసేకరణ అవసరమని తెలిపారు.

అయితే.. పంప్ హౌస్‌కు కావాల్సిన 12 ఎకరాలు మాత్రమే సేకరించారని కవిత వెల్లడించారు. కరకట్ట, చెక్ డ్యామ్ కోసం 200 ఎకరాల భూసేకరణ అవసరమైతే గుంట కూడా సేకరించలేదని విమర్శించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ద్వారా ముంపుకు గురైన రైతులకు ప్రభుత్వం ఎకరాకు 25 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నాగిరెడ్డిపేట్‌లో ముంపు రైతులతో సమావేశమయ్యారు. బాన్సువాడలో ప్రభుత్వ గురుకుల కళాశాలను సందర్శించారు. కామారెడ్డి జిల్లాలో నిజాంసాగర్ ప్రాజెక్టును, నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను పరిశీలించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News