Homeహైదరాబాద్‌MLA | ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ప్రారంభం

MLA | ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ప్రారంభం

మల్కాజిగిరి, నవంబర్ 24 (ఆదాబ్ హైదరాబాద్): మల్కాజ్‌గిరి నియోజకవర్గం(Malkajgiri Constituency)లోని ఆర్‌కే నగర్‌లో కొత్తగా ఏర్పాటుచేసిన అల్వాల్ ఆబ్కారీ (Excise-ఎక్సైజ్) పోలీస్ స్టేషన్‌(Police Station)ను స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి (Marri rajashekar reddy) సోమవారం ప్రారంభించారు. పలువురు కార్పొరేటర్లు (Corporators) పాల్గొన్న ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల భద్రత, చట్టం, న్యాయం పరిరక్షణలో ఎక్సైజ్ శాఖ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. కొత్త స్టేషన్ ప్రారంభంతో మద్యం అక్రమ రవాణా(Liquor smuggling), వినియోగాన్ని మరింత కట్టడి (Control) చేయొచ్చని తెలిపారు. ప్రజలకు సేవ చేయడంలో అధికారులు సమర్థంగా వ్యవహరించాలని సూచించారు.

- Advertisement -
mla marri2

సహాయ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుందరెడ్డి, అల్వాల్–మల్కాజ్‌గిరి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్‌ఐలు కుమార స్వామి, సంధ్యారాణి, స్టేషన్ సిబ్బంది, కార్పొరేటర్లు చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా అనిల్ కిషోర్ గౌడ్, మేకల సునీత, రాము యాదవ్, మాజీ కార్పొరేటర్లు జగదీష్ గౌడ్, ఆకుల నర్సింగ్ రావు, నాయకులు జేఏసీ వెంకన్న, మేకల రాము యాదవ్, అనిల్ కిషోర్ గౌడ్, డోలి రమేష్, చిన్న యాదవ్, సురేష్, శరణగిరి, హేమంత్ రెడ్డి, సాయిగౌడ్, సంపత్ యాదవ్, ఉపేందర్, నర్సింగ్ రావు, శ్రీకాంత్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News