పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక వాచ్ బహూకరించిన మెగాస్టార్
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ (Director) అనిల్ రావిపూడి (Anil Ravipudi) పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi) ప్రత్యేకంగా శుభాకాంక్షలు (Special Wishes) తెలిపారు. అందమైన వాచ్(Watch)ని గిఫ్ట్(Gift)గా అందించారు. కేక్ కట్ (Cake Cut) చేసి బర్త్ డే సెలబ్రేట్ చేశారు. చిరంజీవి చెప్పిన హృదయపూర్వక శుభాకాంక్షలు, ఇచ్చిన ఈ సర్‌ప్రైజ్ గిఫ్ట్ అనిల్ రావిపూడికి మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్‌గా నిలిచాయి.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ తెరకెక్కుతోంది. నయనతార హీరోయిన్. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల’ రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ క్రాస్ చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలుగు సినిమా మ్యూజిక్‌కి కొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేసింది.
చిరంజీవి తన సిగ్నేచర్ చార్మ్, ఎక్స్‌ప్రెషన్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్‌తో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఈ పాటకు వస్తున్న అద్భుతమైన స్పందనతో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. సాహూ గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నిర్మిస్తున్న ‘మన శంకరవర ప్రసాద్ గారు’ 2026 సంక్రాంతికి గ్రాండ్‌గా విడుదల కానుంది.
