Wednesday, February 11, 2026
Homeనిజామాబాద్‌Mla Pocharam | చెరువులోకి చేప పిల్లల విడుదల

Mla Pocharam | చెరువులోకి చేప పిల్లల విడుదల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Government) ఉచితం(Free)గా సరఫరా (Supply) చేస్తున్న చేప పిల్లలను (Fish) రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే (Banswada MLA) పోచారం శ్రీనివాసరెడ్డి (Srinivasa reddy), రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు (Kasula Balaraju) వర్ని మండలం జలాల్‌పూర్ గ్రామంలోని పెద్ద చెరువులోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. మత్స్యకారులకు ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

దేశంలో మన రాష్ట్రంలో మాత్రమే మత్స్యకారులకు 100 శాతం సబ్సిడీ(Subsidy)తో చేప విత్తనాన్ని సరఫరా చేస్తున్నారని చెప్పారు. మరే రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం లేదని తెలిపారు. గతంలో మత్స్యకారులకు చేప పిల్లను కొని చెరువులో విడుదల చేసే ఆర్థిక స్థోమత లేకపోవడంతో దళారులు పెట్టుబడులు పెట్టి చెరువులపై పెత్తనం చెలాయించేవారని గుర్తుచేశారు. మత్స్యకారుల శ్రమను దోపిడీ చేసేవారని ఆవేదన వెలిబుచ్చారు. దళారులకు చేపలను అమ్మొద్దని కోరారు. మత్స్యకారులు స్వయంగా గ్రామాలు, పట్టణాల్లో తిరిగి అమ్ముకోవాలని సూచించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, జిల్లా మత్స్యశాఖ అధికారి ఆంజనేయ స్వామి, ఫిషరీస్ మాజీ అడిషనల్ డైరెక్టర్ శంకర్ నాయక్ రాథోడ్, వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News