Wednesday, February 11, 2026
Homeరంగారెడ్డిElectricity | విద్యుత్ సదుపాయాలను మెరుగుపరచండి..

Electricity | విద్యుత్ సదుపాయాలను మెరుగుపరచండి..

  • విద్యుత్ శాఖ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫారుఖీని కోరిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి…

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గురువారం తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫారుఖీని హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని అల్వాల్ సర్కుల్ వెంకటాపురం డివిజన్ పరిధిలోని యాదమ్మనగర్ లో పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాలు నివసిస్తున్న ప్రాంతంలో విద్యుత్ సదుపాయాలను మెరుగుపరచాలని కోరుతూ పలు అభ్యర్థనలు చేశారు.

ముఖ్యంగా యాదమ్మనగర్ ప్రాంతంలో విద్యుత్ బల్క్ మీటర్ల ఏర్పాటు, కొత్త విద్యుత్ సబ్‌స్టేషన్‌ల ఏర్పాటు,నూతన ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాట్లు,సింగిల్ ఫేజ్ నుంచి త్రీ ఫేజ్ కన్వర్షన్, బంచ్ కేబుల్స్ ఏర్పాటు,అవసరమైన చోట విద్యుత్ స్తంభాల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.సదరు విషయాలపై ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫారుఖీ, త్వరితగతిన చర్యలు తీసుకుంటామని తెలిపినట్టు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, లక్ష్మణ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News