Wednesday, April 15, 2026
HomeఫోటోలుProduction No-7 | కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా గ్రాండ్‌గా లాంఛ్

Production No-7 | కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా గ్రాండ్‌గా లాంఛ్

మాయ(Maya), మానగరం, మాన్‌స్టర్, తానక్కరన్, ఇరుగపాత్రు, బ్లాక్ వంటి వరుసగా 6 విజయవంతమైన చిత్రాల తర్వాత పొటెన్షియల్ స్టూడియోస్ (Potential Studios) తమ ప్రొడక్షన్ నంబర్ 7ను గ్రాండ్‌గా లాంఛ్ చేసింది. ఈ చిత్రంలో జాతీయ స్థాయి(National Level)లో ప్రశంసలు పొందిన లోక స్టార్ కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) హీరోయిన్‌(Heroine)గా నటిస్తున్నారు.

ఈ చిత్రంలో నాన్ మహాన్ అల్లా ఫేమ్ దేవదర్శిని, వినోద్ కిషన్, కీలక పాత్రలు పోషించనున్నారు. నూతన దర్శకుడు ధీరవియం SN దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో ప్రవీణ్ భాస్కర్ & శ్రీ కుమార్ దర్శకుడితోపాటు స్క్రీన్‌ప్లే సంభాషణలు రాశారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చారు. గోకుల్ బెనోయ్ సినిమాటోగ్రఫీ అందించారు. అరల్ ఆర్.తంగం ఎడిటర్‌గా, మాయాపాండి ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఇనాజ్ ఫర్హాన్, షేర్ అలీ కాస్ట్యూమ్స్ అందిస్తున్నారు.

- Advertisement -

పొటెన్షియల్ స్టూడియోస్ బ్యానర్‌పై SR ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు, పి.గోపీనాథ్, తంగప్రభహరన్ ఆర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈరోజు చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. విలక్షణమైన కథనాలను, బాక్సాఫీస్ (Box Office) విజయాలను అందించడంలో పేరుపొందిన పొటెన్షియల్ స్టూడియోస్, కళ్యాణి ప్రియదర్శన్‌తో కలిసి పనిచేయడంతో ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌లు త్వరలో అనౌన్స్ చేస్తారు.

Kalyani Priyadarshan to be launched as heroine in grand manner

నటీనటులు: కళ్యాణి ప్రియదర్శన్, దేవదర్శిని, వినోద్ కిషన్
ప్రొడక్షన్ బ్యానర్ – పొటెన్షియల్ స్టూడియోస్ LLP
నిర్మాతలు – SR ప్రకాష్ బాబు, SR ప్రభు, పి గోపీనాథ్, తంగప్రభహరన్ R
దర్శకుడు – ధీరవియం SN
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మద్రాస్ కృష్ణ
డిఓపి- గోకుల్ బెనోయ్
సంగీతం – జస్టిన్ ప్రభాకరన్
ఎడిటర్ – అరల్ ఆర్ తంగం
ప్రొడక్షన్ డిజైనర్ – మాయాపాండి
కాస్ట్యూమ్ డిజైనర్లు – ఇనాజ్ ఫర్హాన్ /షేర్ అలీ
పీఆర్వో: వంశీ శేఖర్

- Advertisement -
RELATED ARTICLES

Latest News