Sunday, February 22, 2026
Homeఅంతర్జాతీయంIndia Market | 3 తైవాన్ ఉత్పత్తుల రాక

India Market | 3 తైవాన్ ఉత్పత్తుల రాక

అద్భుత ఆవిష్కరణలను భారత్‌కు పరిచయం చేసిన తైవాన్ ఎక్స్‌లెన్స్
అవి.. LUFTQI, Vinxper, COTTAI

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన ఆవిష్కరణలను (Innovations) భారతదేశానికి (India) పరిచయం చేసే సంప్రదాయాన్ని తైవాన్ కొనసాగిస్తోంది. ఈ మేరకు తైవాన్ ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOEA).. తైవాన్ ఎక్స్‌లెన్స్(TE)ను చేపట్టింది. ఇందులో భాగంగా.. ఇండియన్ మార్కెట్లోకి 3 అవార్డులు గెలుచుకున్న ఉత్పత్తులను విడుదల చేసింది. అవి.. LUFTQI, Vinxper, COTTAI. ఈ మూడు ప్రముఖ తైవాన్ బ్రాండ్‌ల నుంచి వచ్చాయి. లైఫ్‌స్టైల్(జీవనశైలి), ఆహారం & పానీయాలు, ఇంటి అలంకరణ (డెకార్) విభాగాల్లో ఉత్తమ నాణ్యతకు చిహ్నాలు.

- Advertisement -

ఈ బ్రాండ్‌లన్నీ కలిసి తైవాన్ అద్భుత డిజైన్(Design), సాంకేతిక సామర్థ్యాన్ని (Technical Capacity) ప్రదర్శిస్తూ ప్రపంచ స్థాయి ప్రమాణాలున్న ఉపయోగకరమైన ఆవిష్కరణలను ఇండియాకి అందిస్తున్నాయి. భారత మార్కెట్లో తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ బ్రాండ్‌లు తమ వ్యాపారాన్ని విస్తరిస్తూ వ్యూహాత్మకంగా పంపిణీ చేసే భాగస్వాముల కోసం చురుకుగా వెతుకుతున్నాయి. ఆరోగ్యకరమైన గాలి శుద్ధి కావొచ్చు.. అధునాతన వైన్ టెక్నాలజీ కావొచ్చు.. తెలివైన అలంకరణ పరిష్కారాలు కావొచ్చు.. తెలివైన, స్థిరమైన, ప్రీమియం జీవన అనుభవాలను కోరుకునే భారతీయ వినియోగదారుల కోరికలను ఈ కొత్త ప్రొడక్టులు నెరవేరుస్తాయి.

మన దేశంలో వేగంగా మారుతున్న వినియోగదారుల అభిరుచులు, ప్రీమియం డిజైన్‌లు, స్మార్ట్ లివింగ్ పరిష్కారాలు, పర్యావరణ అనుకూల (సుస్థిర) ఉత్పత్తుల కోసం భారత్‌లో డిమాండ్ పెరుగుతోంది. ఈ వాతావరణం.. తైవాన్ బ్రాండ్‌ల వృద్ధికి బలమైన వేదికను అందించనుంది. గత కొన్నేళ్లుగా ఎలక్ట్రానిక్స్, ఐసీటీ, లైఫ్‌స్టైల్, ఆరోగ్యం, ఆటోమేషన్ వంటి రంగాల్లో ప్రపంచ స్థాయి ఆవిష్కరణలను మన దేశానికి పరిచయం చేయడంలో తైవాన్ ఎక్స్‌లెన్స్ కీలక భూమిక పోషించింది. కొత్త ఉత్పత్తుల రాక ఈ లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News