Tuesday, February 10, 2026
Homeహైదరాబాద్‌Naveen Yadav | జూబ్లీహిల్స్ ప్రజలకు పాదాభివందనం

Naveen Yadav | జూబ్లీహిల్స్ ప్రజలకు పాదాభివందనం

తనను భారీ మెజారిటీతో ఎమ్మెల్యే(Mla)గా గెలిపించిన జూబ్లీహిల్స్ (JubileeHills) ప్రజలకు నవీన్ యాదవ్ పాదాభివందనాలు తెలిపారు. ఎంతో కష్టపడి నియోజకవర్గ కార్యకర్తలు తనను గెలిపించారని చెప్పారు. జూబ్లీహిల్స్ ప్రజలు, కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేయబోనని హామీ ఇచ్చారు. BRS Party గెలిచిన సమయంలో కక్షపూరిత రాజకీయాలు చేశారని, తాను మాత్రం అలాంటి రాజకీయాలు చెయ్యనని మాటిచ్చారు. అందరినీ కలుపుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి (Development) చేస్తానని చెప్పారు.

మన ప్రాంత సమస్యల(Problems)ను సీఎం రేవంత్ (CM Revanth) దృష్టికి తీసుకెళతానని పేర్కొన్నారు. అభివృద్ధే తన ఎజెండా (Agenda) అని స్పష్టం చేశారు. తన వ్యక్తిత్వాన్ని, తన కుటుంబ గౌరవాన్ని దెబ్బతీస్తూ ఓట్లు అడిగారని, అందుకు జూబ్లీహిల్స్ ప్రజలు గట్టి సమాధానం చెప్పారని ఎద్దేవా చేశారు. రిగ్గింగ్, దౌర్జన్యం అంటూ తప్పుడు మాటలు మాట్లాడారని, ప్రభుత్వం నుంచి ఎక్కువ బడ్జెట్ సాధించి జూబ్లీహిల్స్‌ని మరింత అభివృద్ధి చేస్తానని నవీన్ యాదవ్ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News