జూబ్లీహిల్స్ బైఎలక్షన్(JubileeHills Bye Election)లో బీఆర్ఎస్(BRS)దే విజయమని ఆ పార్టీ గ్లోబల్ కోఆర్డినేటర్ (Party Global Coordinator) మహేష్ బిగాల (Mahesh Bigala) అన్నారు. మాగంటి సునీత (Maganti Suneetha) భారీ ఆధిక్యతతో గెలవబోతున్నారని పేర్కొన్నారు. ఎన్ఆర్ఐలు (NRIs) సునీత సక్సెస్ కోసం తమ వంతు పాత్ర పోషించారని, సామాజిక మాధ్యమాల్లో (Social Media) విరివిగా ప్రచారం నిర్వహించారని చెప్పారు.
ఆఫ్‌లైన్‌లోనూ చాలా మంది ఎన్ఆర్ఐలు బీఆర్ఎస్ విజయం కోసం కష్టపడ్డారని తెలిపారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Magnati Gopinath) చేసిన సేవలను ప్రజలు గుర్తు చేసుకొని, ఆయన ఆశయాలను కొనసాగించేందుకు సునీతకు మద్దతుగా నిలిచారని అన్నారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, టాంజానియా, గల్ఫ్ తదితర దేశాల నుంచి ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ప్రతిఒక్కరికీ మహేష్ బిగాల ధన్యవాదాలు తెలిపారు.
