హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం(BRAOU), హెల్త్ సెంటర్, రెనోవా హాస్పిటల్స్ (Renova Hospitals) ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు సమగ్ర ఆరోగ్య సంరక్షణ కోసం ‘ఉచిత ఆరోగ్య శిబిరం’ నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి.. ఉద్యోగులకు అందించనున్న కుటుంబ ఆరోగ్య కార్డు(Health Card)ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. త్వరలో ఉద్యోగులందరికీ హెల్త్ కార్డు అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి.పుష్పాచక్రపాణి, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్.విజయారెడ్డి, హెల్త్ సెంటర్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ప్రమీలా కేతావత్, అన్ని విభాగాల డైరెక్టర్లు, బోధన, బోధనేతర సిబ్బంది, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొని వైద్య పరీక్షలు (Medical Tests) చేయించుకున్నారు. రెనోవా హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ కేఆర్ స్బారిఫ్, డాక్టర్ కృష్ణ ప్రభాకర్, డాక్టర్ హేమంత్, డాక్టర్ హిమాకాంత్, డాక్టర్ వారిస్, డాక్టర్ సూర్య, డాక్టర్ అక్రమ్ అలీ, డాక్టర్ శ్రావణి తదితరులు వైద్య శిబిరంలో పాల్గొని పరీక్షలు చేశారు.
