Thursday, February 12, 2026
Homeహైదరాబాద్‌Tribals | గిరిజనుల సంస్కృతిని కాపాడాలి

Tribals | గిరిజనుల సంస్కృతిని కాపాడాలి

గిరిజనుల జీవిత విధానాన్ని(Life Style), సంస్కృతి(Culture)ని కాపాడాలంటే ప్రభుత్వాలు (Governments) వారి నిజమైన అవసరాలను తీర్చాలని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి, విశ్రాంత ఐ.ఏ.ఎస్‌ డాక్టర్ ఇ.ఎ.ఎస్‌.శర్మ అన్నారు. సోమవారం హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (University Of Hyderabad)లో జరిగిన పుస్తకావిష్కరణ (Book Release) కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. యూనివర్సిటీ సోషల్‌ సైన్స్‌ విభాగంలో ఆంత్రపాలజీ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

మల్టీ డిసిప్లినరీ స్టడీస్‌ ఆఫ్‌ ది డెక్కన్‌ ట్రైబ్స్‌ (Multidisciplinary Studies of the Deccan Tribes) అనే ఆంగ్ల గ్రంథాన్ని శర్మ, సోషల్‌ సైన్స్‌ డీన్‌ ప్రొఫెసర్ కె.సునీతా రాణి ఆవిష్కరించారు. శర్మ మాట్లాడుతూ ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో గిరిజనులను అడవి నుంచి దూరం చేస్తున్నారని తప్పుపట్టారు. ప్రముఖ గిరిజన పరిశోధకురాలు డాక్టర్ ఊర్మిళ పింగ్లె 1969 నుంచి పరిశోధన చేసి రాసిన వ్యాసాలను సంకలనంగా తేవటం అభినందనీయమని కితాబిచ్చారు. సునీతా రాణి మాట్లాడుతూ ప్రముఖ చిత్రకారుడు రామ్‌చందర్‌ గుహ (Ramchandra Guha) ఈ పుస్తకానికి ఇంట్రడక్షన్ రాశారంటేనే దీని ప్రాముఖ్యత అర్థంచేసుకోవచ్చని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News