Monday, January 19, 2026
EPAPER
Homeహైదరాబాద్‌Bc Reservations | మరో మహా ఉద్యమం ప్రారంభం

Bc Reservations | మరో మహా ఉద్యమం ప్రారంభం

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో బీసీల ధర్మపోరాటం పేరిట చైతన్య–అవగాహన రథయాత్ర

జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలుకు రాజ్యాంగ సవరణ సరైన మార్గం

- Advertisement -

జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్ల సాధన పోరాటాన్ని (struggle to achieve BC reservations) జాతీయ స్థాయి(National Level)లో ఉదృతం చేస్తామని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు(President of the National BC Dal), బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి తెలిపారు. ఇందులో భాగంగా నవంబరులో ‘బీసీల ధర్మ పోరాటం’ (BCs Dharma Poratam) పేరిట గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్ర స్థాయిలో రిజర్వేషన్ల అవసరంపై విభిన్న రీతుల్లో నిరసనలు తెలియజేస్తామని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ (BC Reservations Implementation Coordination JAC) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బీసీ సంఘాలు, కుల సంఘ నేతలు, యువతతో కలిసి బీసీ చైతన్య–అవగాహన రథయాత్రగా పలు ప్రాంతాల్లో పర్యటించి, సదస్సులు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ.. దేశంలోని, రాష్ట్రంలోని అన్ని బీసీ సంఘాలు(Bc Unions), మేధావులు, ప్రజా సంఘాలు, దేశంలోని రిజర్వేషన్ల అనుకూల పార్టీల సమన్వయంతో ప్రధాన నగరాల్లో, జాతీయ స్థాయిలో భారీ సభలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. “42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధించాలంటే రాజ్యాంగ సవరణ చేసి, ఈ అంశాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చడమే సరైన మార్గం” అని పేర్కొన్నారు.
దానికోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, అందుకోసం బీజేపీ ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వం, అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు ఐక్యంగా పోరాటం చేయాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ బీసీ దళ్ అధ్యక్షుడు రాజేష్ యాదవ్, 26 కులాల కార్యదర్శి సత్యనారాయణ, కుల సంఘ నేతలు, బీసీ సంఘ నేతలు, మేధావులు, న్యాయవాదులు, ప్రజా సంఘ నేతలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News