సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హైదరాబాద్ నల్లకుంట(Nallakunta)లోని శంకర మఠంలో గణపతి, శారదాంబ, చంద్రమౌళీశ్వర స్వామి, ఆదిశంకరాచార్యుల ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శంకర మఠంలో శృంగేరి శారదా పీఠం (Sringeri Sharada Peetham) జగద్గురువులు (Jagadgurus) శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీతీర్థ మహాస్వామి(Sri Sri Sri Vidhusekhara Bharati Tirtha Mahaswami) వారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

“ధర్మ విజయ యాత్ర”(Dharma Vijaya Yathra)లో భాగంగా హైదరాబాద్‌కు విచ్చేసిన శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీస్వామి వారికి ఈ సందర్భంగా సీఎం రేవంత్ వేములవాడ (Vemulawada) ఆలయ అభివృద్ధి వివరాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎంతోపాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.



