Wednesday, October 29, 2025
ePaper
HomeతెలంగాణKTR | మైనార్టీలను మోసం చేసిన కాంగ్రెస్

KTR | మైనార్టీలను మోసం చేసిన కాంగ్రెస్

  • బీజేపీ స్కూల్లో శిక్షణ పొందిన రేవంత్ రెడ్డి
  • బీఆర్ఎస్ హయాంలోనే వారికి మేలు జరిగింది
  • మేమూ కొన్ని పొరపాట్లు చేసినా.. మేలు చేశాం
  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి

రాష్ట్రంలో మైనార్టీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మైనార్టీల కోసం రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పి ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. తాము కూడా కొన్ని కొన్ని పొరపాట్లు చేసి ఉంటే చేసుండొచ్చు కానీ.. ఇండియాలో మైనార్టీలకు కేసీఆర్ చేసినన్ని పనులు ఇంకెవరూ చేయలేదని కొనియాడారు. హైదరాబాద్ లోని శంషాబాద్ లో సోమవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ మైనారిటీ నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్పై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ విషయాన్ని ఇతర రాష్ట్రాల్లో అసదుద్దీన్ ఒవైసీ కూడా చెప్పారు.. కానీ ఇక్కడ చెప్పరని విమర్శించారు.

రాష్ట్రంలో నడుస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం కాదని.. ఇది కాంగ్రెస్ -బీజేపీ కలిసి నడిపిస్తున్న ప్రభుత్వమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క మైనార్టీ ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ లేరని అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలోనైనా ఒక్క మైనార్టీ లీడర్ ను కూడా ఎన్నుకోలేదని దుయ్యబట్టారు. షబ్బీర్ అలీ, అజారుద్దీన్ లాంటి వారు కూడా కాంగ్రెస్కు కనిపించట్లేదా? అని ప్రశ్నించారు.. ఎమ్మెల్సీ ఇచ్చినట్లే ఇచ్చి అజారుద్దీన్ను పక్కన పెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రికెట్లో అజారుద్దీన్ కట్ షాట్లు కొడితే.. ఇక్కడ అజారుద్దీన్నే రేవంత్ రెడ్డి కట్ చేసేశారని+ర్ అయ్యారు. బుల్డోజర్ రాజ్యం నడవదని యూపీపై రాహుల్ గాంధీ విమర్శించారని..

ఇక్కడ అదే బుల్డోజర్ రాజ్యం నడుస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు సైలెంట్గా ఉన్నారని ప్రశ్నించారు. హైడ్రా గురించి రాహుల్ గాంధీ సైలెంట్గా ఉంటారని విమర్శించారు. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్తో పాటు మరో తొమ్మిది మంది ఎమ్మెల్యే పార్టీ మారారని మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను మీరు ఏ పార్టీలో ఉన్నారని వారిని అడగాలని.. వాళ్లు సమాధానం చెప్పలేరని విమర్శించారు. ఇదే విషయంపై కడియం శ్రీహరిని ప్రశ్నిస్తే.. ‘ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నా’ అని సమాధానం చెప్పారని.. ఇది వాళ్ల పరిస్థితి అంటూ ఎద్దేవా చేశారు.

సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలు మోదీ జేబు నింపే సంస్థలని రాహుల్ గాంధీ. విమర్శిస్తే.. రేవంత్ రెడ్డి మాత్రం కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగిస్తారని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి బంధువుకు కేంద్రంలో కాంట్రాక్టులు వస్తాయని.. బదులుగా రేవంత్ రెడ్డి కూడా బీజేపీ నేతలకు లాభం చేకూరుస్తారని ఆరోపించారు. మోదీ తెచ్చిన చట్టాలను బీజేపీ పాలిత రాష్ట్రాలకంటే తొందరగా ఇక్కడ రేవంత్ అమలు చేస్తారని విమర్శించారు. ఇది బడే భాయ్ కోసం రేవంత్ రెడ్డి చేసిన పని అంటూ ఎద్దేవా చేశారు. మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పి పురుషులకు టికెట్ రేట్ డబుల్ చేశారని విమర్శించారు.

కాంగ్రెస్ మాట తప్పిందని.. రెండేళ్లు అయిపోయాయి.. ఇంకో మూడేళ్లలో కూడా వీళ్లు చేసేది ఏమీ ఉండదని కేటీఆర్ విమర్శించారు. శంషాబాద్లో బీఆర్ఎస్ మైనార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ షాదీ ముబారక్ వంటి పథకాన్ని ప్రవేశపెట్టారు.. షాదీ ముబారక్ కింద రూ. లక్ష ఇస్తే.. మేం అంతకంటే ఎక్కువ ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని.. మైనార్టీలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా చూస్తోందని ఆరోపించారు. మైనార్టీ స్కూళ్లను కేసీఆర్ ప్రారంభించారని.. మైనార్టీ స్కూల్స్ ఎంతో మంది విద్యార్థులు డాక్టర్లు అవుతున్నారన్నారు.

నాలుగు ఉన్న మెడికల్ కాలేజీలు కేసీఆర్ 34కు పెంచారాని.. విద్యార్థులకు 20 లక్షల స్కాలర్షిప్ ఇచ్చారని.. పదేళ్లలో ఎన్నో పనులు చేశారన్నారు. మోదీ స్కూల్లో చదివానని.. చంద్రబాబు కాలేజీకి వెళ్లానని.. రాహుల్ దగ్గర ఉద్యోగం చేస్తున్నానని రేవంత్ బహిరంగంగానే చెబుతున్నారని.. చౌకీదార్ చోర్ అని రాహుల్ అంటే..

రేవంత్ రెడ్డి కాదు కాదు.. ఆయన నా పెద్దన్న అని చెబుతున్నాడన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలు మోదీ జేబు సంస్థలు అని విమర్శిస్తే.. రేవంత్ రెడ్డి మాత్రం కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగిస్తారని.. ఒక సంవత్సరం క్రితం పొంగులేటి ఇంటిపై ఈడీకి రైడ్స్ అయ్యాయని.. ఒకటి కాదు రెండు రోజులు రైడ్స్ అయ్యాయని గుర్తు చేశారు. నోట్లు లెక్కపెట్టే మెషిన్లను లోపలికి తీసుకెళ్లిన దృశ్యాలు అంతా చూశారని. అంత జరిగిన తర్వాత ఏమైంది.. ఏమీ కాలేదు.. అంతా సైలెంట్ అంటూ విమర్శించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News