పీర్ షబ్బీర్ (Peer Shabbir) సామాజిక సేవకుడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. మైనారిటీ(Minority), మెజారిటీ (Majority) మధ్యనే కాదు.. హిందూ (Hindu) ముస్లిం(Muslim)లు కలిసి ఉండే ఒక మంచి వాతావరణాన్ని తీసుకొచ్చారని చెప్పారు. వారి మరణం ముస్లిం సోదరులకే కాదు.. తెలంగాణకు తీరని లోటని పేర్కొన్నారు. రాష్ట్రంలో వారు చేసిన సేవలు మరువలేనివని తెలిపారు. ఆయన లేకపోవడం బాధాకరమని, అందుకే వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చానని వెల్లడించారు. మైనారిటీ సమస్యలను పరిష్కరించేందుకు ఆయన ఎంతో కృషి చేశారని, వారి సేవలను శాశ్వతంగా గుర్తించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పారు. వారి ఆశయాలకు అనుగుణంగా మైనారిటీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
