అంబులెన్స్ (Ambulance) సర్వీసెస్ మెదక్ జిల్లా కోఆర్డినేటోర్ రవి కుమార్ సోమవారం కౌడిపల్లి (Kaudipalli) ఎస్ఐ మురళిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మురళి మాట్లాడుతూ అంబులెన్స్ సర్వీసులను ఉత్తమం(Best)గా అందిస్తున్న రవికుమార్, జగన్, ఈఎంటీ రాజును అభినందించారు. ఇటీవల పెరుగుతున్న ప్రమాదాలను (Accidents) దృష్టిలో ఉంచుకొని అంబులెన్స్ సర్వీస్‌లను అందుబాటులో ఉంచుతున్నారని తెలిపారు. ప్రజల(Public)కు ఇబ్బంది కలగకుండా అన్నివేళలా 108, 102, 1962 అంబులెన్స్‌తో సహకరిస్తున్నారని చెప్పారు. సకాలంలో అంబులెన్స్ సేవలు అందుతుండటం పట్ల ఎస్ఐ మురళి హర్షం వ్యక్తం చేశారు.
- Advertisment -
