Monday, October 27, 2025
ePaper
HomeజాతీయంPuducherry | ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం

Puducherry | ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం

స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద 25 బస్సులు
ప్రారంభించిన లెఫ్టినెంట్ గవర్నర్ కైలాసనాథన్, సిఎం రంగసామి, స్పీకర్ ఆర్ సెల్వం
దేశంలో 440 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణించిన ఒలెక్ట్రా విద్యుత్ బస్సులు
135.4 మిలియన్ లీటర్ల డీజిల్ ఆదా చేసిన ఒలెక్ట్రా విద్యుత్ బస్సులు

నగర రవాణా వ్యవస్థలో పుదుచ్చేరి మరో ముందడుగు వేసింది. తాజాగా ఎలక్ట్రిక్ బస్సు (Electric Bus) సేవలను ప్రారంభించింది. ఈ బస్సులను ఒలెక్ట్రా (Olectra) తయారుచేసింది. ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో పేరొందిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్(ఓజిఎల్) రూపొందించిన 25 బస్సులను పుదుచ్చెరి రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(పీఆర్టీసీ) సోమవారం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. బస్సులను లెఫ్టినెంట్ గవర్నర్ కె.కైలాశ్‌నాథన్(Lieutenant Governor K. Kailashnathan), సీఎం ఎన్.రంగసామి (CM N. Rangasamy), సభాపతి ఆర్.సెల్వం(Speaker R. Selvam) జెండా ఊపి ప్రారంభించారు.

ఎలక్ట్రిక్ బస్సులను మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (Meil) గ్రూప్ సంస్థ ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఈవీ ట్రాన్స్ పీవిటీ ఎల్టిడి) గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్(జిసిసి) విధానంలో 12 సంవత్సరాలపాటు నడిపించటంతోపాటు మెయింటెనెన్స్ చేస్తుంది. స్మార్ట్ సిటీ మిషన్‌లో భాగంగా చేపట్టిన విద్యుత్ బస్సులు నడిపే కార్యక్రమం పుదుచ్చేరి ప్రభుత్వం పరిశుభ్రమైన, సమర్థవంతమైన, ఆధునిక ప్రజా రవాణా దిశగా వేసిన ముందడుగుగా చెప్పొచ్చు. పీఆర్టిసి నడిపే ఈ బస్సుల్లో 9 మీటర్ల పొడవు గల 15 నాన్-ఏసీ, 10 ఏసీ బస్సులు ఉన్నాయి. ఇవి ఒక్కసారి చార్జ్‌ చేస్తే సుమారు 200 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. ఈ బస్సులు శబ్ద, కాలుష్యరహితంగా ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి.

పుదుచ్చెరి కూడా దేశంలో ఒలెక్ట్రా బస్సులను నడిపే నగరాల జాబితాలో చేరింది. దేశవ్యాప్తంగా ఒలెక్ట్రా బస్సులు ఇప్పటివరకు 440 మిలియన్ కిలోమీటర్లకుపైగా ప్రయాణించాయి. ఫలితంగా సుమారు 135.4 మిలియన్ లీటర్ల డీజిల్ ఆదా అయింది. సుమారు 362.8 మిలియన్ కిలోగ్రాముల కర్బన ఉద్గారాలను తగ్గించాయి. దాదాపు 1.68 కోట్ల చెట్లు నాటడం వల్ల వచ్చే పర్యావరణ ప్రయోజనం దీనివల్ల సాధ్యమైంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News