షహీది గురుపురబ్ ఉత్సవాల్లో (Shaheedi Gurupurab celebrations) పాల్గొనాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని పంజాబ్ మంత్రులు (Punjab State Ministers) ఆహ్వానించారు. ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సంజీవ్ ఆరోరా, వ్యవసాయ శాఖ మంత్రి గుర్మీత్ సింగ్ కుడియన్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే నెల(నవంబర్)లో జరిగే శ్రీ గురుతేజ్ బహదూర్ జీ(Shri Guru Tegh Bahadur Ji) 350వ అమరవీరుల వార్షికోత్సాల్లో(గురుపురబ్) పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageshwar Rao)తోపాటు ఇతర ప్రతినిధులు ఉన్నారు.
Punjab | సీఎం రేవంత్‌కి ‘పంజాబ్’ ఆహ్వానం
RELATED ARTICLES
- Advertisment -
