ప్రజలతో మమేకమైన వెన్నెలక్క, వర్ష యాదవ్
జూబ్లీహిల్స్ (Jubileehills) నియోజకవర్గ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) బుధవారం రహమత్ నగర్ డివిజన్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచారంలో తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెలక్క(Vennelakka), జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) సతీమణి వర్ష యాదవ్ (Varsha Yadav) పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ వెళ్లి ఆడపడుచులను ఆత్మీయంగా లింగనం చేసుకొని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న, చేయనున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ప్రతిఒక్కరూ ఓటు వేసి, వేయించి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు. ప్రజలతో మమేకమై చేతి గుర్తు పైన ఓటు వేసి, వేయించి భారీ మెజారిటీ (Majority) ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాలుపంచుకున్నారు.
