కేంద్ర బ్యాంక్ వద్ద భారీగా బంగారం నిల్వలు
బంగారానికి ప్రజలు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మన దేశ కేంద్ర బ్యాంక్ (Central Bank) కూడా అంతే ప్రాధాన్యత ఇస్తోంది. సాధ్యమైనంత ఎక్కువ స్వర్ణాన్ని (Gold) కొనుగోలు చేసి దాచిపెడుతోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సెప్టెంబర్‌లో 2 క్వింటాల బంగారాన్ని కొనుగోలు చేసింది. దీంతో.. తన వద్ద ఉన్న పసిడి నిల్వలు 880.18 టన్నులకు చేరింది. సెప్టెంబర్ 26వ తేదీ నాటికి ఈ గోల్డ్ రిజర్వ్‌ల విలువ రూ.8.36 లక్షల కోట్లకు పెరిగింది. ఆర్‌బీఐ దగ్గర ఉన్న మొత్తం ఫారెక్స్ రిజర్వ్స్(Forex Reserves)లో బంగారం వాటా 13.5 శాతానికి సమానం.
