Monday, October 27, 2025
ePaper
HomeతెలంగాణMahesh Goud | దివ్యాంగుల కళాశాలలో దీపావళి వేడుకలు

Mahesh Goud | దివ్యాంగుల కళాశాలలో దీపావళి వేడుకలు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Tpcc Chief Mahesh Kumar Goud) ఆదర్శంగా నిలిచారు. దీపావళి (Diwali) వేడుకలను దివ్యాంగుల కళాశాలలో జరుపుకొని తనలోని మానవత్వాన్ని, మంచితనాన్ని చాటుకున్నారు. సోమవారం హైదరాబాద్ బేగంపేటలోని మయూరి నగర్ దేవనార్ అంధుల డిగ్రీ కాలేజీ(Devnar Degree College For Blind)లో విద్యార్థినులతో కలిసి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. స్వీట్స్ పంపిణీ చేసి వారితో కొద్దిసేపు గడిపారు. ప్రజాప్రతినిధులు కనీసం పర్వదినాల సమయంలోనైనా దివ్యాంగుల పట్ల పెద్ద మనసు చాటుకోవాలని పరోక్షంగా సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు అందిస్తున్న సంక్షేమ పథకాల (Welfafe Schemes) గురించి వివరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News