Monday, October 27, 2025
ePaper
Homeనల్లగొండLiquor | కోమటిరెడ్డి Vs జూపల్లి

Liquor | కోమటిరెడ్డి Vs జూపల్లి

మద్యం దుకాణాలకు రాజగోపాల్‌రెడ్డి కొత్త రూల్స్
దీనిపై ఎక్సైజ్ మంత్రికి వ్యాపారుల ఫిర్యాదు
ఆ నిబంధనలు చెల్లవన్న మంత్రి జూపల్లి

కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో ప్రస్తుతం కోమటిరెడ్డి (Komatireddy) వర్సెస్ జూపల్లి (Jupalli) ఎపిసోడ్ తెర మీదికి వచ్చింది. మునుగోడు నియోజకవర్గంలో మద్యం దుకాణాలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొత్త నిబంధనలు పెట్టారు. మద్యం దుకాణాలను సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకే తెరిచి ఉంచాలని, పర్మిట్ రూమ్‌(Permit Room)లు ఉండొద్దని రాజగోపాల్ రెడ్డి కండిషన్స్ పెట్టడంతో మద్యం వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో టెండర్లు వేయడానికి భయపడి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వద్దకు వెళ్లారు. విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై మంత్రి జూపల్లి స్పందిస్తూ రాష్ట్రమంతా ఒకటే రూల్ ఉంటుందని, ఒక్కో నియోజవర్గానికి ఒక్కో రూల్ ఉండదని చెప్పారు. నిబంధనలను అందరూ ఫాలో అవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు. మరోవైపు.. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై అధిష్టానాని(High Command)కి పూర్తి నివేదిక పంపినట్లు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ వ్యవహారం ఎటువైపునకు దారితీస్తుందో చూడాలి.

RELATED ARTICLES
- Advertisment -

Latest News