సురక్ష సేవా సంఘం సామాజిక సేవా కార్యక్రమాలు, ప్రజా అవగాహన సదస్సులు, న్యాయ సంబంధిత అంశాలు, నిరుద్యోగ యువతకి అండగా ఉచిత శిక్షణా శిబిరాలు, గ్రామాలలో మెడికల్ క్యాంపు లు నిర్వహణ, పెడదోవ పట్టిన యువతకు కౌన్సెలింగ్ , పేదింటి ఆడబిడ్డ కు పుస్తె మెట్టెలు, వివాహ కానుకలు, రోడ్డు ప్రమాదల క్షతగాత్రులకు ఆస్పత్రికి తరలింపు, నిరుపేద విద్యార్ధులకు నోటు పుస్తకాల పంపిణీ, స్కూలు ఫీజులు కట్టడం, వలస కార్మికులకు ఉపాధి, విడిపోయిన భార్యా, భర్తలకు కౌన్సెలింగ్ చేసి తిరిగి వారిని ఒకటిగా చేయటం, ఉచిత కంటి ఆపరేషన్లు, అనాథ శవాల అంతిమ సంస్కారాలు.. ఇలా అనేక రంగాల్లో . ఆపదలో ఆపన్న హస్తంగా నిలుస్తున్నది సురక్ష సేవా సంఘం.

ఇంతటి మహత్తర కార్యక్రమానికి…వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తూ… ప్రతీ సేవా కార్యక్రమము లో భాగస్వామ్యులు గా ఉన్న సురక్ష సేవా సంఘం గ్రూపు సబ్యులు కృషి ఎంతో విలువైనది. సురక్ష సేవా సంఘం ఏర్పాటు చేసిన ఆతి తక్కువ కాలం లోనే జిల్లా వ్యాప్తంగా… రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది సంఘ సభ్యులుగా చేరి రెండు రాష్ట్రాల లోనూ సుమారు 6000 మంది క్రియాశీలక సభ్యులుగా ఏర్పడి అతి పెద్ద సేవా సంస్ధగా అవతరించింది.




