పోలీసు అమర వీరుల సంస్మణ దినం సందర్భంగా 2016 అక్టోబర్ 21న ప్రజా శ్రేయస్సు కొరకై…సమాజ సేవే ముఖ్య లక్ష్యంగా ఏర్పడి దిగ్విజయంగా తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని… తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు సరిహద్దు రాష్ట్రాల ప్రజల మన్ననలు పొందిన సురక్ష. రంగారెడ్డి జిల్లా… అబ్దుల్లా పూర్ మెట్ మండల కేంద్రంలోని JNNURM కాలనీ వేదికగా….సంస్థాగతంగా రెక్కలు తొడిగి… మండల స్థాయి, జిల్లా స్థాయి…రాష్ట్ర స్థాయి లో గత 9సంవత్సరాలుగా… ఉభయ రాష్ట్రాలలో ఎక్కడ నుండి ఏ సహాయం కోసం విజ్ఞప్తి వచ్చినా… మేము ఉన్నాం అంటూ ముందుకు వచ్చి తక్షణమే స్పందించి విరాళాలు సేకరించి సమస్య తీరే వరకూ… ఆద్యంతం పర్యవేక్షించి టాస్క్ పూర్తి చేసి, సమాజంలో ని విభిన్న కోణాల్లో అవసరమయ్యే ఎటువంటి సమస్య నైనా సురక్ష దృష్టికి వస్తే… అది పూర్తి చేసేంతవరకు నిద్రపోకుండా.. అలుపెరగని నిరంతర కృషి చేస్తున్న సురక్ష సేవా సంఘం పేద ప్రజల పాలిట ఒక వరం. సురక్ష సేవా సంఘం పేరు చెప్తే.. ఉభయ రాష్ట్రాలలో తెలియని వారంటూ ఎవరూ ఉండరు.



