శిక్షణ పొందిన సర్వేయర్ల(Surveyors)కు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో లైసెన్సులు అందజేశాను. గత పాలకుల ధరణి దారుణాల నుంచి రైతులకు విముక్తి కల్పిస్తూ భూ భారతి(Bhu Bharathi) తెచ్చామని చెప్పారు. ఇక పై సమగ్ర భూ సర్వేల ఆధారంగా రైతులకు తమ భూముల పై పక్కా హక్కులు కల్పిస్తామని తెలిపారు. ఇక పై గ్రామ గ్రామాన లైసెన్సుడ్ సర్వేయర్లు రైతుల సేవకు కంకణం కట్టుకోవాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
