Monday, October 27, 2025
ePaper
HomeతెలంగాణDiwali Wishes | రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ దీపావళి శుభాకాంక్షలు

Diwali Wishes | రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ దీపావళి శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్ర ప్రజలకు దీపావళి పండుగ (Diwali Festival) శుభాకాంక్షలు తెలిపారు. రెండేళ్ల ప్రజా పాలన(Praja Palana)లో ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రజల జీవితాల్లో ప్రజా ప్రభుత్వం కొత్త వెలుగులు తీసుకువచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ వెలుగుల పండుగను రాష్ట్రంలోని ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు.దీపాల కాంతులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. పర్యావరణానికి హాని కలిగించకుండా చిన్నా పెద్దలందరూ ఆనందంగా పండుగ జరుపుకోవాలని, ప్రమాదాలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News