జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్‌గూడలోని యాదగిరి నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం ఉత్సాహంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్, నవీన్ యాదవ్ సతీమణి “వర్ష యాదవ్”, సినిమా హీరో సుమన్ పాల్గొని ప్రజలను ఆత్మీయంగా కలుసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే ఓటు వేయాలని కోరుతూ అభివృద్ధి, సమానత్వం, సంక్షేమం కోసం కాంగ్రెస్నే ప్రజల ఆశగా నిలబెట్టాలని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

