నిజామాబాద్ నగరంలో విధుల్లో ఉన్న సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్యను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి త్రీవంగా ఖండించారు. నిందితుడు రియాజ్‌ను ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితుడి కుటుంబానికి ఆర్థిక సాయంతోపాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. కానిస్టేబుల్‌ను ఒక దొంగ కత్తితో పొడిచి చంపుతుండగా చూసిన స్థానికులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించటం అమానవీయమని, సిగ్గుచేటని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మండిపడ్డారు.
MLA RAKESH REDDY: కానిస్టేబుల్ హంతకుణ్ని కాల్చిచంపాలి
RELATED ARTICLES
- Advertisment -
