Monday, October 27, 2025
ePaper
Homeఖమ్మంBHATTI: ఖమ్మం, వరంగల్ జిల్లాల విద్యుత్‌పై సమీక్ష

BHATTI: ఖమ్మం, వరంగల్ జిల్లాల విద్యుత్‌పై సమీక్ష

ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల విద్యుత్ శాఖ పనితీరుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 సాధనలో విద్యుత్ శాఖ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కి అనుగుణంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను విస్తరించి, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని సబ్‌స్టేషన్ల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

‘ఖమ్మం జిల్లాలో పారిశ్రామిక అవసరాల కోసం రెండు 400 కేవీ సబ్‌స్టేషన్లు మంజూరు చేయనున్నాం. విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తూ, ప్రతి వారం పొలంబాట కార్యక్రమం ద్వారా ఫీల్డ్ స్థాయిలో పరిశీలన చేయాలని సూచించాను. వరదల సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న విద్యుత్ సిబ్బంది కృషి ప్రశంసనీయమని అభినందించాను. సిబ్బందికి యూనిఫామ్‌లు, టెక్నీషియన్లతో కూడిన విద్యుత్ అంబులెన్స్‌లు ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్నాం. గృహజ్యోతి లబ్ధిదారులకు జీరో బిల్లులు అందిస్తూ, ప్రభుత్వం చెల్లించే మొత్తం ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని సూచించాను. సోలార్ ప్రాజెక్టుల ద్వారా పర్యావరణానికి అనుకూలమైన విద్యుత్ ఉత్పత్తిని పెంపొందించేందుకు చర్యలు చేపడతాం’ అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News