దేవాదాయ శాఖలోని అన్ని ఫైళ్లు అప్పగించాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న తాజా నిర్ణయం తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. మంత్రి సురేఖ ఆధ్వర్యంలో ఉన్న దేవాదాయ శాఖలోని అన్ని ఫైళ్లు వెంటనే సంబంధిత అధికారులకు అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే హన్మకొండ జిల్లా కేంద్రంలోని కొండా సురేఖ నివాసం వద్ద భద్రతను తగ్గించినట్లు సమాచారం. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్టీ కార్యకర్తలు, అనుచరులు సురేఖ నివాసానికి చేరుకుంటుండగా, పోలీసులు పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అదనపు బలగాలను మోహరించారు. కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, నేడు జరుగబోయే క్యాబినెట్ సమావేశం అనంతరం సురేఖపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.. గత కొద్ది రోజులుగా దేవాదాయ శాఖలో జరుగుతున్న అవకతవకలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహత వర్గాలు వెల్లడించాయి.. కాగా, గత రెండు రోజులుగా కొండ సురేఖ ఓఎస్‌డీ సంపత్ విషయంలో సురేఖ ఇంటి వద్ద హైడ్రా జరిగినట్లు తెలుస్తుంది.
