Friday, September 20, 2024
spot_img

రైతుబంధు, రైతు బీమాతో ధీమా కల్పించాం

తప్పక చదవండి
  • కాంగ్రెస్ కుట్రతో, ఫిర్యాదు చేసి రైతు బంధును ఆపారు
  • ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ : కాంగ్రెస్ ప్రభుత్వాలు సమీకరణలో 11 సార్లు అధికారంలో ఉన్నారని వారి పాలనలో రైతులకు కనీసం ఒక్క రూపాయి అయినా సాయం చేసిండ్రా అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుబంధు ద్వారా ఇప్పటికే 11 సార్లు పంట సాయం అందించామని తెలిపారు. రైతుబంధు, రైతు బీమాతో ధీమా కల్పించామన్నరు. మహబూబ్ నగర్ రూరల్ మండలం ఓబులాయిపల్లి తండా, ఓబులాయపల్లి, కోటకదిర గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రైతును ఆదుకునేందుకు రైతుబంధు పథకం ద్వారా పాఠశాలయం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓరలేక ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి ఆపించారని మంత్రి విమర్శించారు. రైతుబంధును కేవలం నెల రోజులు మాత్రం ఆపగలరని ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.16 వేల రైతుబంధు సాయం అందిస్తుందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి జిల్లాలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని, వలసలను శాశ్వతంగా నివారిస్తామని తెలిపారు. జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ మల్లు నర్సింహారెడ్డి, ఎంపీపీ సుధాశ్రీ, జెడ్పీటీసీ వేంకటేశ్వరమ్మ, వైస్ ఎంపీపీ అనిత, పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, సర్పంచ్ రమ్య, నాయకులు రవీందర్ రెడ్డి, పాండురంగారారెడ్డి, రాజ వర్ధన్ రెడ్డి, నరేందర్ రెడ్డి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు