Friday, October 10, 2025
ePaper
HomeతెలంగాణEducational | శిధిలావస్థకు చేరువలో మండల విద్యా వనరుల కేంద్రాలు 

Educational | శిధిలావస్థకు చేరువలో మండల విద్యా వనరుల కేంద్రాలు 

రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లా లోని మండలాలలోమండల విద్యా వనరుల కేంద్రంములు శిథిలావస్థకు చేరువలో ఉన్నాయి అనేక మండల విద్యావనుల కేంద్రంలలో పై భాగములు పెచ్చులు ఊడి సలాకులు సైతం బహిర్గతం కావడం వల్ల నిత్యం మండల విద్యావనముల కేంద్రానికి వచ్చే ఉపాధ్యాయులు భయభ్రాంతులకు గురవుతున్నారు.విద్యా వనరుల కేంద్రంలు ఎప్పుడు కూలిపోతుందో అనేటువంటి ఆందోళనల మధ్య మండల విద్యా వనరుల కేంద్రం సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పని చేస్తున్నారు.వివిధ మండలంలో అనేక ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు అధిక సంఖ్యలో ఉన్నాయి. నిత్యం ఏదో ఒక పని మీద ఉపాధ్యాయులు మండల విద్యా వనరుల కేంద్రానికి తరచుగా వస్తుంటారు. ప్రతి సంవత్సరం వివిధ పాఠశాలలకు సరఫరా అయ్యే విద్యార్థులకు సంబంధించిన ఉచిత పాఠ్యపుస్తకాలు, మరియు ఉచిత దుస్తులు అదే విధంగా జావా మరియు బెల్లం ప్యాకెట్లు ఈ మండల విద్యా వనరుల కేంద్రంలోనే నిలువ చేస్తారు.

గత కొన్ని సంవత్సరాలు నుండి పై భాగంలో పెచ్చులూడి అవి కింద పడడం వల్ల సలాకలు బయటికి కనిపిస్తున్నాయి. ప్రతి ఏటా మండల విద్యావనుల కేంద్రం నిర్వహణకు మెయింటెనెన్స్ ఖర్చుల కింద రాష్ట్ర ప్రభుత్వము నుండి నిధులు విడుదలైన వాటితో మరమత్తు చేయించడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. గతంలో మండల స్థాయి టీచర్లకు సమావేశాలు శిక్షణ కార్యక్రమాలు కూడా మండల విద్యా మండల కేంద్రంలోని నిర్వహించేవారు. ప్రస్తుతము ఎంఆర్సిలు శిధిలావస్థకు చేరుకోవడం వల్ల ఉపాధ్యాయులకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు కూడా వివిధ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నారు. ఇకనైనా సంబంధిత విద్యాశాఖ అధికారులు స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా 

సర్వే చేసి వివిధ మండల విద్యావనముల కేంద్రాలను మరమ్మతులు చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

By-కామిడి సతీష్ రెడ్డి

RELATED ARTICLES
- Advertisment -

Latest News