ఇప్పటికైనా బీసీ అభ్యర్ధికి అవకాశం లభిస్తుందా..? అనే శీర్షికతో ఆదాబ్ హైదరాబాద్ ఒక కథనాన్ని ప్రచురించిన సంగతి విదితమే.. జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉప ఎన్నికల్లో, కాంగ్రెస్ అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన నవీన్ యాదవ్(Naveen Yadav) కు అవకాశం లభిస్తుందని ఘంటా పథంగా చెబుతూ.. నవీన్ యాదవ్ కు ఉన్న అర్హతలు, అనుభవం, అవకాశాలు, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, పార్టీలో ఆయనకున్న మంచి పేరును ప్రస్తావిస్తూ ఒక కథనాన్ని రాశాం.. ఇప్పుడా కథనం వాస్తవం అయ్యింది.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్(CONGRESS) అభ్యర్థి ఎంపికపై పీటమూడి వీడింది. ఉత్కంఠకు తెరదించుతూ కాంగ్రెస్ హైకమాండ్ అభ్యర్థిని ఖరారు చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వి. నవీన్ యాదవ్ పేరును ప్రకటించారు. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ బుధవారం రాత్రి అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ అభర్ధిగా నవీన్ యాదవ్ పేరు ప్రకటనతో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు, నవీన్ అభిమాన సంఘాలు ఆనందం వ్యక్తపరిచారు.
ఇదివరకే ఉపఎన్నిక టికెట్ బీసీ అభ్యర్థికే దక్కే ఛాన్స్ ఉందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మరియు కాంగ్రెస్ పెద్దలు చెప్పడం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్(BRS) పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత గోపీనాథ్ పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్(kcr) ప్రకటించారు. ఇక ఉపఎన్నిక భరిలోకి బీజేపీ(BJP) ఎవరినీ దింపనుందో తేల్చలేదు.