Friday, October 10, 2025
ePaper
HomeజాతీయంSabarimala | 'శబరిమల' భక్తులకు గుడ్ న్యూస్

Sabarimala | ‘శబరిమల’ భక్తులకు గుడ్ న్యూస్

కేరళ పతనంతిట్ట జిల్లాలోని శబరిమల(Sabarimala) అయ్యప్ప ఆలయాన్ని తులం మాస పూజల కోసం అక్టోబర్ 17- 22 వరకు తెరవనున్నారు. అక్టోబరు 17న సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరవనున్నట్లు ట్రావెన్‌ కోర్ దేవస్వమ్ బోర్డు (TDB) ప్రకటించింది. ఉదయాస్తమాన పూజ, పడిపూజ, కలశాభిషేకం, పుష్పాభిషేకం వంటి ఐదు రోజుల ప్రత్యేక ఆచారాల తర్వాత అక్టోబర్ 22న రాత్రి 10 గంటలకు మూసివేస్తామని తెలిపింది. ఈ మేరకు ట్రావెన్‌ కోర్ దేవస్వమ్ బోర్డు ప్రకటన విడుదల చేసింది.  అయ్యప్పను దర్శించుకోవాలనుకునే భక్తులు తప్పనిసరిగా వర్చువల్ క్యూ విధానంలో దర్శన టికెట్లు పొందొచ్చు. తులం మాస దర్శనం కోసం బుకింగ్‌లు సోమవారం సాయంత్రం 5 గంటలకు అధికారిక వెబ్‌ సైట్ sabarimalaonline.org ద్వారా ప్రారంభమయ్యాయి. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు ఆన్‌లైన్ బుకింగ్ నుంచి మినహాయింపును ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News