తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) మరియు శాచి డి. భానుషాలి బ్లడ్ సెంటర్‌ను హైదరాబాద్‌లోని ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర భవన్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ దిలీప్ భానుషాలి, తన దివంగత భార్య శాచి డి. భానుషాలి స్మారకార్థం ఈ ఆధునిక రక్త కేంద్రాన్ని స్థాపించేందుకు విశేషంగా సహకరించారు. ఈ బ్లడ్ సెంటర్ ఆధునిక సాంకేతికతతో, అత్యున్నత వైద్య ప్రమాణాలతో ఏర్పాటుచేయబడిందని నిర్వాహకులు తెలిపారు. రక్తదానం, రక్తసేకరణ, మరియు అత్యవసర వైద్య అవసరాల కోసం ఈ సెంటర్ రాష్ట్రవ్యాప్తంగా ఉపయోగపడనుందని గవర్నర్ పేర్కొన్నారు.
