Monday, October 6, 2025
ePaper
HomeతెలంగాణRSS | కరీంనగర్‌లో ఘనంగా ఆర్ఎస్ఎస్ పథ సంచాలన్…

RSS | కరీంనగర్‌లో ఘనంగా ఆర్ఎస్ఎస్ పథ సంచాలన్…

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం కరీంనగర్‌లో పథ సంచాలన్ నిర్వహించింది. కరీంనగర్ లోని పలు ప్రాంతాల మీదుగా సాగిన రూట్ మార్చ్ లో భారీ ఎత్తున పాల్గొని టిటిడి కళ్యాణమండపం వరకు కవాతు నిర్వహించారు. అనంతరం టిటిడి కళ్యాణమండపంలో జరిగిన సమావేశానికి తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ జి ముఖ్యఅతిథిగా హాజరై స్వయం సేవకులను ఉద్దేశించి మాట్లాడారు..రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ భారతదేశాన్ని తమ మాతృభూమిగా భావించే ప్రజల ప్రయోజనాలను రక్షించడమే ఆశయంగా, సమాజ, దేశ సేవ లక్ష్యంగా డాక్టర్ కేశవ్ రావు బలి రామ్ పంత్ హెడ్గేవార్ (డాక్టర్ జి) ఆర్ఎస్ఎస్ సంస్థను మహారాష్ట్రలోని నాగపూర్‌లో 1925న విజయదశమి రోజున ప్రారంభించారని తెలిపారు. ఈ విజయదశమికి ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నా శుభ సందర్భంలో శతజయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తుందని తెలిపారు.

ఆర్ఎస్ఎస్ పుట్టిందే మాతృభూమి సేవకోసమన్నారు. హైందవాన్ని ఒక మతంగా కాక ఒక జీవన విధానంగా, భారత ప్రజలను భరతమాత రూపంగా భావించి, భారతదేశాన్ని తమ మాతృభూమిగా భావించే ప్రజల కోసం , దేశ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడం కోసం, సమాజసేవ కోసం కోట్లాది స్వయం సేవకులు నిరంతరం పనిచేస్తూ..నిస్వార్ధ సేవ లక్ష్యంతో ముందుకు కొనసాగుతుందన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు పంచ పరివర్తన్ లక్ష్యం దిశగా కొనసాగుతున్నాయన్నారు. ఇందులో ముఖ్యంగా ఐదు అంశాలను స్వయం సేవకులు ప్రతి ఇంటికి వెళ్లి తెలియజేసే విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్‌ను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు.

ఆర్ఎస్ఎస్ ఒక పవర్ హౌస్ లాంటిదని, ఒక పవర్ హౌస్ నుండి కరెంటు దేశంలోని అన్ని అవసరాలకు ఎలా ఉపయోగపడుతుందో…ఆర్ఎస్ఎస్ కూడా అదేవిధంగా దేశం కోసం ఉపయోగపడే పని చేస్తుందన్నారు. ముఖ్యంగా వ్యక్తి సరైన వాడైతే సమాజం కూడా సరైన దిశలో ప్రయాణిస్తుందని తెలిపారు. ప్రధానంగా సంఘం నిర్వహించే శాఖ పద్ధతి ద్వారా వ్యక్తి నిర్మాణాన్ని చేస్తుందనీ, గంటసేపు శాఖలో జరిగే వివిధ కార్యక్రమాలతో వ్యక్తి వికాసం కోసం కృషి చేస్తుందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News