Saturday, October 4, 2025
ePaper
Homeసాహిత్యంAlai Balai| అలై బలై కార్యక్రమం తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది: బీజేపీ నేత బాలరాజు

Alai Balai| అలై బలై కార్యక్రమం తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది: బీజేపీ నేత బాలరాజు

మాజీ హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన అలై బలై కార్యక్రమంలో బీజేపీ కేంద్ర కో-ఆర్డినేటర్ (తెలంగాణ) బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఈ వేడుక తెలంగాణ సమృద్ధమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఉత్సాహభరితంగా జరిగిందన్నారు. ఈ సందర్భంలో రాజకీయ నాయకులు, కళాకారులు, సాహిత్య ప్రేమికులు, మరియు వివిధ వర్గాల ప్రజలు ఒకే వేదికపై కలుసుకుని, ఐక్యత, సామరస్యం, సోదరభావం అనే సందేశాన్ని సమాజానికి అందించారు. బండారు దత్తాత్రేయ ఈ అద్భుతమైన ఆలోచన ప్రజల మధ్య సామాజిక బంధాలను బలపరుస్తూ, మన సంప్రదాయాల అసలు స్ఫూర్తిని ప్రపంచానికి చాటే ఒక అద్భుత వేదికగా నిలిచిందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News