ఇప్పటి వరకు టాలీవుడ్ స్టార్ లవ్ బర్డ్స్ గా ఉన్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఇక పెళ్లిబంధంతో ఒకటవనున్నారు. ఈమేరకు శుక్రవారం విజయ్ దేవరకొండ ఇంట్లో చాలా సీక్రెట్ గా వీరి నిశ్చితార్ధం జరిగింది. దీంతో చాలా కాలంగా వస్తున్న రూమర్స్ కు చెక్ పెడుతూ త్వరలోనే ఈ ఇద్దరు ఒక్కటి కాబోతున్నారు. ఇరు కుటుంబాలకు సంబదించిన అత్యంత సన్నిహితుల మధ్య చాలా సింపుల్ గా ఈ వేడుక జరిగింది. అయితే, ఎంగేజ్ మెంట్ తంతు ముగియడంతో పెళ్లి ఎప్పుడు ఉంటుంది అనేది విషయం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు వచ్చే మాఘమాసంలో వీరి పెళ్లి చేయాలనీ నిశ్చయించారట కుటుంబసభ్యులు.
ఈ మధ్య చాలా మంది సెలబ్రెటీలు చేసుకుంటున్నట్టుగా డెస్టినేషన్ వేడింగ్ లా కాకుండా.. పూర్తి సంప్రదాయబద్దంగా ఈ పెళ్లి వేడుక జరుగనుందని సమాచారం. అలాగే, వివాహానంతరం హైదరాబాద్ లోనే గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నారట. ఈ వేడుకకు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ ఇండస్ట్రీల నుంచి ప్రముఖులు హాజరవుతారని టాక్. ఇక విజయ్ దేవరకొండ-రష్మీక మందన్నా గీత గోవిందం సినిమాలో మొదటిసారి కలిసి నటించారు. ఈ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయమే ప్రేమకు దారి తీసింది. కానీ, తాము జస్ట్ ఫ్రెండ్ అంటూ కలరింగ్ ఇచ్చుకుంటూ వచ్చారు. పలు వేడుకలకు కలిసి వెళ్లడం, ఒకరి సినిమాకు ఒకరు విషెస్ చెప్పుకోవడం కూడా చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ చూస్తే అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు అనిపించేది. ఇప్పుడు అభిమానులకు సడెన్ సర్ ప్రైజ్ ఇస్తూ ఎంగేజ్ మెంట్ రింగ్ లు మార్చేసుకున్నారు. దీంతో విజయ్, రష్మిక ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.