హైదరాబాద్: హైడ్రా అక్రమనిర్మాణాల కూల్చివేతలను ముమ్మరం చేసింది. కొండాపూర్‌లోని ఆర్టీఏ కార్యాలయం పక్కన భిక్షపతి నగర్లో సర్వే నెంబర్ 59లో ఉన్న 36 ఎకరాల ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది తొలగించారు. ఈ భూమి 12 మంది రైతుల ఆధీనంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేతల వద్దకు ఎవరినీ అనుమతించలేదు. రెండు కిలోమీటర్ల దూరంలోనే బారికేడ్లను ఏర్పాటు చేసి స్థానికులను అడ్డుకున్నారు. కూల్చివేతలు కొనసాగుతున్న స్థలానికి పోలీసులు మీడియాను అనుమతి ఇవ్వలేదు.