ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తి అయిన అమెరికాలో ఒక వింత సమస్య తరచుగా తలెత్తుతుంది. అదే ప్రభుత్వ కార్యకలాపాల నిలుపుదల లేదా షట్‌డౌన్. ఇది కేవలం తాత్కాలిక పాలనాపరమైన ఇబ్బంది కాదు. రాజకీయ నాయకులు దేశ బడ్జెట్ విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతే, దేశ కార్యకలాపాలే ఆగిపోయే ప్రమాదకరమైన సంక్షోభం ఇది. అమెరికాలో ప్రభుత్వ కార్యకలాపాలు సజావుగా సాగాలంటే అక్కడి పార్లమెంటు అయిన కాంగ్రెస్ ఖర్చు పెట్టడానికి చట్టపరమైన అనుమతి ఇవ్వాలి. ఈ విధానం యాంటీడిఫిషియెన్సీ చట్టం (ఎడిఎ) అనే పాత చట్టంలో ఉంది. ఫెడరల్ ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులు అందించేందుకు పార్లమెంట్ తప్పనిసరిగా ప్రతి సంవత్సరం ఒక బడ్జెట్‌ను లేదా తాత్కాలిక ఖర్చు బిల్లును ఆమోదించాలి. ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి, అంటే అక్టోబర్ 1వ తేదీలోపు, కాంగ్రెస్ ఈ నిధుల బిల్లులను ఆమోదించడంలో విఫలమైతే, ప్రభుత్వంలో అత్యవసరం కాని విభాగాల సేవలు తాత్కాలికంగా మూసివేయబడతాయి. దీనినే ప్రభుత్వ షట్‌డౌన్ అంటారు.
America Shut Down|అమెరికా షట్‌డౌన్ ఎందుకు ?
RELATED ARTICLES
- Advertisment -