Friday, October 3, 2025
ePaper
HomeజాతీయంMODI | స్వంతంత్ర భారత్ చరిత్రలో ఇదే తొలిసారి..

MODI | స్వంతంత్ర భారత్ చరిత్రలో ఇదే తొలిసారి..

స్వంతంత్ర భారత్ చరిత్రలో తొలిసారిగా దేశీయ కరెన్సీపై భారతమాత చిత్రాన్ని చూడటం జరిగిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దేశ రాజధాని ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని తపాలా బిళ్ల, నాణెంను విడుదల చేశారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. ముందుగా దేశ ప్రజలందరికీ నవరాత్రి శుభాకాంక్షలు చెప్పారు..ఈ 100 రూపాయల నాణెంపై ఒక వైపు జాతీయ చిహ్నం, మరోవైపు సింహం అంకితభావంతో పనిచేసే స్వచ్ఛంద సేవకులు భారతమాతకు నమస్కరిస్తున్న చిత్రం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీక. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల క్రితం ఈ గొప్ప పండుగ రోజున స్థాపించడం జరిగిందని ప్రధాని గుర్తు చేశారు.  

ఆర్ఎస్ఎస్ అంటే విజయం, ఆర్ఎస్ఎస్‌కు దేశమే ముఖ్యం అని చెప్పారు. దేశానికి సేవ చేసేందుకు సంఘ్ ఎప్పుడూ ముందుంటుందని వెల్లడించారు. దేశమే ప్రథమం అనేది సంఘ్ విధానం అని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ సేవకులు నిస్వార్థంగా పని చేస్తారని ప్రధాని చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలను సంఘ్ రక్షిస్తోందని, దేశ అభివృద్ధిలో ఆర్ఎస్ఎస్ఐ కీలకమైన పాత్ర అని అన్నారు. సంఘ్ దేశాభివృద్ధి కోసమే పని చేస్తోందని, కొందరు ఆర్ఎస్ఎస్‌పై తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేశారని చెప్పారు. ఆర్ఎస్ఎస్‌పై ఎన్నో అక్రమ కేసులు పెట్టారని గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్ భారతమాత సేవకే అంకితమైందని ప్రధాని మోడీ వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News