Friday, October 3, 2025
ePaper
HomeతెలంగాణPonnam Prabhakar | బీసీ రిజర్వేషన్లకు అన్ని పార్టీలు మద్దతు తెలపాలి

Ponnam Prabhakar | బీసీ రిజర్వేషన్లకు అన్ని పార్టీలు మద్దతు తెలపాలి

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రీజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో కులగణన నిర్వహించడం, ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయడం, కేబినెట్ ఉపసంఘాన్ని నియమించడం, చివరకు అసెంబ్లీ, మండలిలో బిల్లులు ఆమోదించడం వంటి చర్యలన్నీ అన్ని పార్టీల సహకారంతోనే జరిగాయని మంత్రి గుర్తు చేశారు. ఈ బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపినట్లు తెలిపారు.

జీవో ఎంఎస్ 9 జారీ చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరగాల్సి ఉందని, అక్కడ ప్రభుత్వం తరపున వాదనలు బలంగా వినిపిస్తామని పేర్కొన్నారు.

“అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు మద్దతుగా అన్ని పార్టీలు హైకోర్టులో తప్పనిసరిగా అఫిడవిట్లు సమర్పించాలి” అని పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ఈ సందర్భంగా అన్నీ పార్టీలను కోరారు.

మరిన్ని వార్తలు:

పేదలకు నాణ్యమైన భోజనం అందిస్తాం: మంత్రి పొన్నం

RELATED ARTICLES
- Advertisment -

Latest News