Friday, October 3, 2025
ePaper
HomeతెలంగాణKTR | స్థానిక ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధం

KTR | స్థానిక ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధం

హైదరాబాద్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు తమ పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సోమవారం నాడు ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని ఆయన అన్నారు. అందుకే రాష్ట్ర ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వం వైపు చూస్తున్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం తప్పదని కేటీఆర్ అన్నారు.

ఎన్నికల కమిషన్ గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆయన తెలంగాణ భవన్‌లో పార్టీ శ్రేణులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వ మోసాలను తెలియజేయడానికి ప్రారంభించిన ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ప్రచారమే బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుందని కేటీఆర్(KTR) పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం ఎలా విఫలమైందనే విషయాన్ని ఈ ‘బాకీ కార్డు’ ప్రచారం ద్వారా ప్రజలకు వివరిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు :

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

RELATED ARTICLES
- Advertisment -

Latest News