హైదరాబాద్: తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల(Telangana local body elections) షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సోమవారం ప్రకటించింది. జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ మరియు గ్రామ పంచాయతీలకు అక్టోబర్-నవంబర్ నెలల్లో మొత్తం ఐదు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఎన్నికల వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మీడియాకు వెల్లడించారు. ఈ ఎన్నికల ప్రక్రియలో కోటి 67 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను అక్టోబర్ 23, 27 తేదీలలో రెండు విడతల వారీగా నిర్వహించనున్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికలను అక్టోబర్ 31, నవంబర్ 4, నవంబర్ 8 తేదీలలో మూడు విడతలుగా నిర్వహించనున్నారు.
ఎంపీటీసీలు, జెడ్‌పీటీసీల ఓట్ల లెక్కింపు నవంబర్ 11న జరగనుంది. గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు మాత్రం పోలింగ్ జరిగిన వెంటనే పూర్తి చేస్తారు.
రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఈ ఎన్నికలు(Telangana local body elections) జరగనున్నాయి. కోర్టు స్టేలు ఇచ్చిన 14 ఎంపీటీసీలు, 27 గ్రామ పంచాయతీలు, 246 వార్డులకు మినహా మిగిలిన అన్ని స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
మరిన్ని వార్తలు :