Friday, October 3, 2025
ePaper
Homeఆంధ్రప్రదేశ్YAMINI SHARMA|యాభై వేల ఆలయాలు కడతాం: యామినీశర్మ

YAMINI SHARMA|యాభై వేల ఆలయాలు కడతాం: యామినీశర్మ

ఆంధ్రప్రదేశ్ సీఎం ప్రకటనపై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలకు బీజేపీ అధికార ప్రతినిధి యామినీశర్మ కౌంటర్ ఇచ్చారు. ప్రజలు చెల్లించే పన్నులతో నడిచే ప్రభుత్వానికి, హిందువులు హుండీలో వేసే ముడుపులతో సేవచేసే ధార్మిక సంస్థలకు తేడా తెలుసుకుని ఏపీ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మాట్లాడాలని అన్నారు. టీటీడీ ద్వారా దళిత వాడల్లో మరో 5వేల వేంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పగానే షర్మిల సమాజసేవ,  అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. 5 వేలు కాదు, 50 వేల ఆలయాలు కట్టుకుంటాం. వాటి గురించి మాట్లాడడానికి మీకేం హక్కు ఉందని ప్రశ్నించారు. భక్తులు ఇచ్చిన నిదులను టీటీడీ ధూపదీప నైవేద్యాల కోసం, ధార్మిక వ్యాప్తికోసం ఖర్చు పెడుతోంది. హిందూ ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వ సొమ్ములు తీసుకోవడం లేదు. ప్రభుత్వమే దేవాదాయ శాఖ ద్వారా ఆలయాల నుంచి పన్నులు వసూలు చేస్తోంది. టీటీడీ ఇప్పటికే ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు చేస్తోంది అని ఆమె గుర్తు చేశారు. ప్రజలపై అంత ప్రేమ ఉంటే మీ ఆస్తులు మొత్తం సమాజానికి ఇవ్వాలని షర్మిలకు యామినీ సూచించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురించి మాట్లాడే హక్కు ఆమెకు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా దళితులను ఓటు బ్యాంకుగానే చూసిందని విమర్శించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News