రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త డిప్యూటీ గవర్నర్‌గా శిరీష్ చంద్ర ముర్ము ను నియమించడం జరిగింది. ఆయన పదవి కాలం మూడేళ్ళ వరకు ఉంటుంది.
అక్టోబర్ 9వ తేదీ నుంచి ఆయన డిప్యూటీ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. అక్టోబర్ 8న పదవీకాలం ముగియనున్న ఎం. రాజేశ్వర్ రావు గారి స్థానంలో శిరీష్ చంద్ర ముర్ము గారు బాధ్యతలు స్వీకరిస్తారు. రాజేశ్వర రావు గారు ఇప్పటికే ఐదేళ్లు డిప్యూటీ గవర్నర్ గా సేవలు అందించారు.
శిరీష్ చంద్ర ముర్ము గారు ప్రస్తుతం ఆర్బీఐలోనే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆర్బీఐ(RBI) నిబంధనల ప్రకారం మొత్తం నలుగురు డిప్యూటీ గవర్నర్‌లు తప్పకుండా ఉండాలి. ప్రస్తుతం టి. రవి శంకర్, పూనం గుప్తా,జె. స్వామినాథన్ ఉప గవర్నర్‌లుగా కొనసాగుతున్నారు.
మరిన్ని వార్తలు :