Friday, October 3, 2025
ePaper
HomeతెలంగాణPonnam Prabhakar|పేదలకు నాణ్యమైన భోజనం అందిస్తాం: మంత్రి పొన్నం

Ponnam Prabhakar|పేదలకు నాణ్యమైన భోజనం అందిస్తాం: మంత్రి పొన్నం

  • మోతినగర్‌లో ఇందిరమ్మ క్యాంటీన్‌ ప్రారంభం
  • ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్ పట్టణంలోని మోతినగర్‌లో ఇందిరమ్మ క్యాంటీన్‌ను జిల్లా ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌ బోర్కడే హేమంత్‌ సహదేవ్‌ రావు, అదనపు కమిషనర్‌లు రఘు ప్రసాద్, పంకజ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..ముఖమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇందిరమ్మ క్యాంటీన్‌లను ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటికే రూ.5 కే భోజనం అందిస్తున్నాం. ఇక నుంచి రూ.5 కే బ్రేక్ ఫాస్ట్ కూడా అందిస్తామన్నారు. నగర వ్యాప్తంగా 60 ఇందిరమ్మ క్యాంటీన్‌లలో భోజనంతో పాటు అల్పాహారం ప్రజలకు అందిస్తాం. ప్రభుత్వంపై ఆర్థికంగా భారం పడినప్పటికీ స్వల్ప రేట్లకే పేద వారికీ నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ బ్రేక్ ఫాస్ట్, భోజనం అందిస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News