దసరా వచ్చింది అంటే చాలు, మనందరికీ గుర్తొచ్చేది పాలపిట్ట(Palapitta)! పాలపిట్టను చూస్తే అదృష్టం వస్తుందని చాలా మంది నమ్మకం. కానీ కొంతమంది ఆ నమ్మకాన్ని మూఢ నమ్మకంగా మార్చి పాలపిట్టలను పట్టుకొని, బోనుల్లో పెట్టి, వాటి రెక్కలు కట్టేసి క్రూరంగా వ్యవహరిస్తున్నారు.. ఈ విషయంలో GHSPCA (గ్రేటర్ హైదరాబాద్ జంతు హింస నివారణ సంస్థ) వాళ్లు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆ సంస్థ కోఆర్డినేటర్ సౌధర్మ భండారి గారు ఒక ముఖ్యమైన ప్రకటన చేసారు.
మీరు ఎక్కడైనా బోనుల్లో బంధించిన పాలపిట్టలను(Palapitta) చూస్తే, వెంటనే ఈ నంబర్లకు ఫోన్ చేసి తెలియచేయగలరని చెప్పారు. 9394578568, 8886743881.
ప్రతి సంవత్సరం, GHSPCA వాలంటీర్లు ఈ పిట్టల్ని కాపాడుతున్నారు. వెటర్నరీ డాక్టర్ల పర్యవేక్షణలో వాటి రెక్కలకున్న కట్లు, గ్లూ అంతా తీసేసి, జాగ్రత్తగా వాటిని స్వేచ్ఛగా వదిలేస్తున్నారు.
నిజానికి, ఈ టీమ్ చాలా ఏళ్లుగా పాలపిట్టలను రక్షిస్తున్నారు. 2019లో 3 పక్షులను, 2020లో 5 పక్షులను, 2021లో 11 పక్షులను, 2022లో 8 పక్షులను, 2023లో 8 పక్షులను, 2024లో 9 పక్షులను కాపాడారు. ఈ దసరాకు పక్షిని ఇబ్బంది పెట్టకుండా, దాన్ని ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతూ చూసి సంతోషిద్దాం!
మరిన్ని వార్తలు :